Friday, April 26, 2024

ఎయిర్ హోస్టెస్‌గా అనసూయ..

- Advertisement -
- Advertisement -

సినిమాల విషయంలో యాంకర్ అనసూయ ఎంత సెలెక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కథలు, పాత్రల ఎంపికపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు గతంలో ఆమె వెల్లడించింది. కేవలం పారితోషికం కోసం తను సినిమాలు చేయనని, తనకు టీవీ ద్వారా చాలా డబ్బు వస్తుందని, సినిమాల ద్వారా తను గుర్తింపును మాత్రమే కోరుకుంటున్నానని క్లియర్‌గా చెప్పేసింది. ఇందులో భాగంగా మంచి పాత్రలు ఎంచుకుంటున్న అనసూయ తాజాగా మరో సినిమాకు సైలెంట్‌గా సైన్ చేసింది. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో ఆమె పాత్రే హైలెట్ అవుతుందట.

అనసూయ ఇందులో ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనుంది. ఇదొక ఆంథాలజీ మూవీ. 6 కథల సమ్మేళనం. ప్రతి కథలో ఓ లీడ్ ఉంటారు. అలా అనసూయ కథ ఇందులో హైలెట్ అవుతుందంటున్నారు. ఇంతకుముందు పేపర్ బాయ్, విటమిన్ షీ సినిమాలతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్న జయశంకర్.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. క్షణం, రంగస్థలం సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న ఆమె జయశంకర్ తీస్తున్న ఆంథాలజీ సినిమాకు ఓకే చెప్పడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది.

Anasuya to play Air Hostess role in Next Movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News