Thursday, September 25, 2025

‘ఒజి’ ఒటిటి రిలీజ్ ఎప్పుడంటే.. మరీ అంత త్వరగానా..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). గురువారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పవన్‌ అభిమానులకు ఈ సినిమాతో దర్శకుడు సుజీత్ ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఉంది. అయితే ఈ సినిమా ఒటిటి రిలీజ్‌పై అప్పుడే సోషల్‌మీడియాలో చర్చ ప్రారంభమైంది. సినిమా విడుదలై కనీసం 24 గంటలు గడవకముందే బుల్లితెరపై ఈ సినిమా ఎప్పుడు వస్తోందా అని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అయితే ఈ సినిమా ఒటిటి హక్కులకు ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. రూ.80 కోట్లతో ‘ఒజి’ (OG Movie) స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని టాక్. దీంతో సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఒటిటిలో సందడి చేసే అవకాశం ఉంది. అంటే అక్టోబర్ నెలాఖరున కానీ, నవంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ ఒజి సినిమా ఈ సినిమా ఒటిటిలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించగా.. సుజిత్ దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సినిమాకు సంగీతం అందించారు.

Also Read : ‘అఖండ 2’ షూటింగ్ పూర్తి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News