Sunday, April 28, 2024

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు అసలేమైంది?

- Advertisement -
- Advertisement -

social media outage

న్యూఢిల్లీ: భారత కాలమానప్రకారం సోమవారం రాత్రి 9.00 గంటలకు ఫేస్‌బుక్, వాట్సాప్‌చ, ఇన్‌స్టాగ్రామ్, ఓకులస్ విఆర్ వంటి సోషల్ మీడియా సర్వీసులు ఆగిపోయాయి. తిరిగి మంగళవారం తెల్లవారు జాము వరకు పునరుద్ధరించబడలేదు. దాదాపు ఆరు గంటలపాటు వాటి సేవలు లభించలేదనే చెప్పాలి.

ఫేస్‌బుక్ లాంగెస్ట్ అవుటేజ్ ఇదేనని చెప్పాలి. సైబర్ దాడి జరిగిందా అని యూజర్లలో ఊహాగానాలు పాదుకున్నాయి. కానీ కాన్ఫిగరేషన్ ఎర్రర్ కారణంగా ఆటంకం ఏర్పడిందని ఫేస్‌బుక్ తర్వాత వివరణ ఇచ్చింది. అయితే ఇంటర్నల్ సిస్టమ్స్ ప్రభావితం అవ్వడం వల్ల ఇలా జరిగిందని సమాచారం.

ఫేస్‌బుక్ ఇంజినీరింగ్ టీమ్స్ కాన్ఫిగరేషన్ మార్పుల వల్ల, నెట్ ట్రాఫిక్ కారణంగా ఆటంకం ఏర్పడి ఉంటుందని కనుగొన్నట్లు వారి బ్లాగ్‌లో తెలిపారు. డిఎన్‌ఎస్ ఎర్రర్ వల్ల ఇలా జరిగిందని చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌కు చెందిన లోటెమ్ ఫినకెలంస్టెన్ తెలిపారు. కొన్ని గంటల ఆటంకానికే అనేక బిలియన్ల నష్టం(రూ. 52,000 కోట్లు) సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్ బుక్ కు  ఏర్పడిందని సమాచారం. సేవల పునరుద్ధరణ తర్వాత ఫేస్‌బుక్ యజమాని జూకర్‌బర్గ్ క్షమాపణ కోరుతూ ఫేస్‌బుక్ సందేశాన్ని పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News