Tuesday, May 7, 2024

నేడు విపక్ష నేతలతో సోనియా భేటీ

- Advertisement -
- Advertisement -
Sonia Gandhi to meet opposition leaders tomorrow
హాజరు కానున్న పవార్, మమత, ఉద్ధవ్, స్టాలిన్

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే కృషిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, కొంత మంది ముఖ్యమంత్రులతో పాటుగా పలువురు విపక్ష నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌లకు సోనియా గాంధీ కార్యాలయం ఆహ్వానాలు పంపిందని, అందుకు వారు అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

శుక్రవారం మాజీ ప్రధాని రాహుల్ గాంధీ జయంతి కూడా కావడం గమనార్హం. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలో ్లప్రతిపక్షాలన్నీ ఒక్కటై పెగాసస్ నిఘా వ్యవహారం, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టడం ద్వారా పార్లమెంటును పలు రోజులు స్తంభింపజేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిననేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండడం గమనార్హం. దేశం ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలపైన, అలాగే యుపి, పంజాబ్ సహా పలు కీలక రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబీల ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి ప్రతిపక్షాలన్నిటినీ ఒక్క తాటిపైకి తేవడానికి కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం జరుగుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News