Friday, May 3, 2024

బ్యాంకులకు టోపీ పెట్టిన ఇద్దరు ఎండిల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two MDs arrested for defaulting bank loan

రూ.3,316 కోట్ల రుణాలు ఎగవేసిన ఆరోపణపై పృథ్వీ
ఐటి సొల్యూషన్స్ ఎండి సతీష్, రూ.750కోట్ల ఎగవేత
కేసులో కార్వీ ఎండి పార్థసారథి అరెస్టులు

మన తెలంగాణ /హైదరాబాద్( సిటిబ్యూరో): పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండి ఉప్పలపాటి సతీష్‌ను ఎ న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ఇడి) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేసు న మోదు చేసుకున్న ఇడి అధికారులు కోర్టు ఆదేశాలమేరకు ఉప్పలపాటి సతీష్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకు ల దగ్గర నుంచి రూ.3,316 కో ట్ల మేర రుణాలు తీసుకుని మో సం చేసినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఇదిలావుండగా ఉప్పలపాటి సతీష్ సోద రి, విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఈనెల 5న ఇడి అరెస్ట్ చే సిన విషయం విదితమే. దాదా పు రూ.1,700 కోట్ల ఫ్రాడ్ కే సులో ఆమెను అదుపులోకి తీ సుకుని విచారించారు. దీంతో హిమబిందు వివిధ బ్యాంకుల నుంచి కంపెనీ నకిలీ పత్రాలతో రుణాలు పొందినట్లు తేలింది.

బ్యాంకు నుంచి రూ. 780 కో ట్ల మేరకు రుణం తీసుకుని తిరి గి చెల్లించకపోవడంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండి పార్థసారధిని నగర సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండి పార్థసారథి ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంకులో కార్వీ షేర్లను తనఖా పెట్టి దాదాపుగా రూ.780 కోట్లు రుణం తీసుకున్నాడు. దీంతో వివిధ బ్యాంకుల అధికారులు నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పార్థసారథిని అరెస్టు చేసి నాంపల్లిలోని కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని 14 రోజులపాటు రిమాండ్‌కు చంచల్‌గూడా జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే..దేశవ్యాప్తంగా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో లక్షలాది మంది వినియోగదారులు వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

కస్టమర్ల షేర్లను ఎండి పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు పొందడం,ఆపై రుణాలు ఏమాత్రం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. స్టాక్ బ్రోకింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కార్వీపై చాలా కాలం నుంచి అక్రమాల ఆరోపణలు వినిపిస్తుండటంతో బ్యాంకుల అధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండి పార్థసారధి హెడ్‌డిఎఫ్‌సిలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్లో రూ.137 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సిలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నాడు. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు తీసుకుని తిరిగి ఒక్కరూపాయ కూడా చెల్లించలేదు. షేర్లు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి పొందిన రుణాలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండి అక్రమంగా వినియోగించుకున్నారని బాధిత బ్యాంకుల అధికారులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కార్వీ రుణాల ఏగవేతపై నగర సిసిఎస్ పోలీసులతో పాటు ఇడి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో కార్విపై గతంలోనే సెబి నిషేధం విధించిందని, బ్యాంకు రుణాలు అక్రమాలకు తరలించిన వైనంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు సిసిఎస్ పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News