Wednesday, May 8, 2024

సోనూనే రియల్ హీరో: ట్విట్టర్‌లో కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సోనూనే రియల్ హీరో : ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్
తెలంగాణకు ఎంతో చేస్తున్నారు.. కాబట్టి కెటిఆరే రియల్: సోనూసూద్ రిప్లై

మీరంటే మీరే రియల్ హీరో అంటూ సోనూ, కెటిఆర్ ఆసక్తికర ట్వీట్లు

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్ రియల్ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా సోనుసూద్ సూపర్ హీరో అంటూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కొనియాడారు. తాము అడగ్గానే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చి సాయం చేసిన కెటిఆర్‌ను నిజమైన సూపర్ హీరో అంటూ నందకిశోర్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ప్రశంసించగా, దానికి మంత్రి కెటిఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కెటిఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తాను ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. సోనూసూద్‌ను సూపర్ హీరోగా పిలవడం సరైనదంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన ట్వీట్‌కు సోనుసూద్‌ను ట్యాగ్ చేశారు. ఆపదలో ఉన్నవాళ్లకు ‘మీరు సాయం చేయండి బ్రదర్’ అంటూ ఆ వ్యక్తికి కెటిఆర్ సూచించారు.
తెలంగాణ నా రెండో ఇళ్లు: సోనూసూద్
మంత్రి కెటిఆర్ ట్వీట్‌పై సోనూసూద్ స్పందించారు. థ్యాంక్ యూ సో మచ్ సర్ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణకు మీరు ఎంతో చేస్తున్నారు. కాబట్టి మీరే రియల్ అంటూ కెటిఆర్‌ను సోనూసూద్ కొనియాడారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణ తన రెండో ఇళ్లుగా భావిస్తానని, అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా తనపై ప్రేమను చూపుతున్నారంటూ ట్వీట్ చేశారు.

Sonu Sood is real superhero: Minister KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News