Saturday, May 4, 2024

సోల్ ఆఫ్ సత్య

- Advertisement -
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తన స్నేహితులతో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో అది. ఈ స్పెషల్ వీడియో నుంచి ‘సత్య’ అనే పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ వీడియోలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి స్వాతి నటించింది. ఈ గ్లింప్స్‌ను మేకర్స్ ‘సోల్ ఆఫ్ సత్య’ అని పేర్కొన్నారు.

గ్లింప్స్‌ను గమనిస్తే సాయిధరమ్‌తేజ్, కలర్స్ స్వాతి పెళ్లి చేసుకోవడం, ప్రేమతో కౌగిలించుకునే సన్నివేశాలను చూడవచ్చు. ఈ మ్యూజికల్ షార్ట్‌లోని పాటను టాలెంటెడ్ సింగర్ శృతి రంజని కంపోజ్ చేసింది. ఇందులో సాయిధరమ్ తేజ్ సైనికుడిగా కనిపిస్తారు. ఓ సైనికుడు,భార్య దేశం కోసం చేసే త్యాగాలను చూపించారు. ఇదే ‘సత్య’లోని ప్రధానమైన ఎమోషన్. సాయిధరమ్ తేజ్‌తో పాటు ఆయన స్నేహితులు హర్షిత్ రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ ఈ మ్యూజికల్ షార్ట్‌లో భాగస్వామ్యులుగా వ్యవహరించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి దీన్ని రూపొందించారు. నవీన్ విజయ్ కృష్ణ డైరెక్ట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News