Tuesday, May 14, 2024

దేశంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కరోనా స్ట్రెయిన్లు గుర్తింపు..

- Advertisement -
- Advertisement -

South African and Brazil strain detected in India

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా స్ట్రెయిన్లు దేశంలో మొత్తం ఐదుగురిలో బయటపడ్డాయి. ఆ దేశాల నుంచి వచ్చిన వారిని చాలా తీక్షణంగా పరీక్షించాలని ప్రభుత్వం వైద్యాధికారులను ఆదేశించింది. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ నలుగురిలోను, బ్రెజిల్ స్ట్రెయిన్ ఒకరిలోను కనిపించిందని ఐసిఎంఆర్ వెల్లడించింది. ఈ ఐదుగురిని క్వారంటైన్‌లో ఉంచారు. బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కేసులు దాదాపు 187 వరకు దేశంలో ఉన్నాయని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కోవిడ్ నెగిటివ్ రిపోర్టులు చూడడమే కాక, ఆర్‌టి సిసిఆర్ పరీక్షలు కూడా చేస్తున్నట్టు చెప్పారు. పాజిటివ్ వస్తే వారి జన్యు క్రమాన్ని పరిశీలిస్తారని తెలిపారు. అదే విధంగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచి వచ్చినవారికి పరీక్షించడమౌతుందని తెలిపారు.

South African and Brazil strain detected in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News