Monday, April 29, 2024

గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం
యుపిలో మహారాజా సుహేల్‌దేశ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

PM Modi lays foundation stone for Maharaja Suheldev memorial

లక్నో: సమాజం కోసం పాటుపడిన వీరులను, మహనీయులను పముచిత రీతిలో గౌరవించడంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను గత ప్రభుత్వాలు సముచి రీతిలో గౌరవించలేదని ఆయన ఆరోపించారు. అర్హులైన నాయకులకు సరైన గౌరవం లభించకపోవడం నిజంగా దురదృష్టకరమన్న ప్రధాని..ఈ విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సరి చేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో మహారాజా సుహేల్‌దేశ్ విగ్రహానికి పునాదిరాయి కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోడీ ఈ విధంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో రాజ్‌భార్ వర్గానికి మార్గదర్శిగా నిలిచిన మహారాజా సుహేల్‌దేశ్.. క్రీస్తుశకం1033లో చిత్తోరా సరస్సు ఒడ్డున జరిగిన యుద్ధంలో ప్రత్యర్థి సలార్ మసూద్‌తో వీరోచిత పోరాటం చేసి, ఆయనను ఓడించి కీర్తి గడించారు. కానీ అనంతర కాలంలో సుహేల్ దేశ్ చరిత్రకు అంతగా ప్రాధాన్యత లభించలేదు. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుహేల్ దేవ్ చరిత్రకు పారచుర్యం తీసుకు రావడం కోసం ప్రాధాన్యత కల్పించింది. ఇందులో భాగంగా పూర్వాంచల్‌ఢిల్లీ మధ్య నడిచే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌కు సుహేల్‌దేశ్ పేరు పెట్టడంతో పాటుగా ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేసింది.తాజాగా శ్రావస్థీ నగరంలో సుహేల్‌దేశ్ విగ్రహానికి పునాది, మెడికల్ కకాలేజికి శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ తీసుకున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.

PM Modi lays foundation stone for Maharaja Suheldev memorial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News