Monday, April 29, 2024

మరో 9 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 9 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఒడిశా మీదగా ప్రయాణించే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలపడంతో ప్రత్యామ్నాయ రైళ్ల కోసం ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ – శాలిమర్, సంత్రగచ్చి – తిరుపతి, హౌరా -ఎస్‌ఎంవిటి బెంగళూరు, శాలిమార్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, వాస్కోడిగామా, హౌరా ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరోపక్క ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రభావం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై పడింది.

ప్రమాదం నేపథ్యంలో ఒడిశా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయంలో ప్రయాణికులకు సరైన సమాచారం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఏ రైలు రద్దు చేశారో ఏ రైలు ఏ సమయానికి బయలుదేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులంతా గందరగోళానికి గురయ్యారు. ఫలితంగా విపరీతమైన రద్దీ నెలకొంది. విచారణ కౌంటర్‌లో సంప్రదించినప్పటికీ సరైన సమచారం లేకపోవడంతో ప్రయాణికులకు నిరాశ మిగిలింది.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఒడిశాలోని బాలాసోర్‌లో ప్రమాదానికి కోరమండల్ సూపర్ ఫాస్ట్, హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తెలంగాణకు చెందిన ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు కోరమండల్లో ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అయితే అతనికి సంబంధించిన సమాచారం రైల్వే అధికారుల వద్ద లేదు. అయినా ఈ రెండు రైళ్లు తెలంగాణ రూట్లలో ప్రయాణించవని, కావున ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News