Saturday, May 4, 2024

జిల్లాపై చెరగని ముద్ర వేసిన రంగనాధ్

- Advertisement -
- Advertisement -

ఎస్పి రెమా రాజేశ్వరి
పూలవర్షం కురింపించి, చేతులతో వాహనాన్ని లాగి అభిమానం చాటుకున్న పోలీస్ అధికారులు
ప్రశంసల వర్షం కురిపించిన పోలీస్ అధికారులు
గజమాలలు, శాలువాలతో అభిమానం
చాటుకున్న జిల్లా పోలీసులు

SP Ranganath transfor from nalgonda

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: సమర్థవంతమైన ఆలోచనలు, అందరిని సమన్వయం చేస్తూ ప్రజలలో పోలీస్ శాఖ గౌరవా న్ని మరింత ఇనుముడింపజేసిన డిఐజి . ఏవి రంగనాధ్ జిల్లా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా నూతన ఎస్పీ రెమా రా జేశ్వరి అన్నారు. సోమవారం అదతనపు ఎస్పీ నర్మద అధ్యక్షతన జిల్లా పోలీస్ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న డిఐజి రంగనాధ్ అత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా ప్ర జలతో మమేకం అవుతూ బాధితుల పక్షాన నిలుస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచడం గర్వకారణంగా ఉందనిచెప్పారు. జిల్లా పోలీస్ అధికారులంతా తనతో అదేరకమైన సహకారం అందించాలని ఆమె కోరారు.

జిల్లా ప్రజల మదిలో మంచి పేరు సంపాదించుకుని వెళ్తున్న రంగనాధ్ భవిఫష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాక్షించారు. సమర్థవంతమైన పనితీరు కారణంగా జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న కారణంగా తన బాధ్యతలు , విధి నిర్వహణ సులువు అవుతుందన్నారు. నల్లగొ ండ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగానే కాకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దులు, నేరాల శాతం ఎక్కువగా ఉండే జిల్లా అని , కానీ అనేక సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ సుదీర్ఘ కాలం జిల్లాలో ఆచన పనిచేయడం ఆయన పనితీరు, నిబద్దతకు నిర్శనమన్నారు. జి ల్లాలోని పోలీస్ అధికారులంతా సమిష్టిగా పనిచేస్తూ మంచి పేరు తె చ్చుకునేలా తనకు సహకరించాలని ఆమె ఆకాంక్షించారు. ఆత్మీయ సన్మానం పొందిన డిఐజి రంగనాధ్ మాట్లాడుతూ సమారు నాలుగు సంవత్సరాలు జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తిని, మంచి అనుభవాలను మిగిల్చిందని చెప్పారు.

మొదట తనకు బదిలీ అయినప్పుడు అయిష్టంగా వచ్చినా ఎంతో సంతృప్తి కలిగించిందని చెప్పారు. అందరి సమిష్టి కృషి కారణంగా సుదీర్ఘ కాలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేయగలిగానని చెప్పారు. మంచి అలోచనా విధానంతో పనిచేయడం , నిర్థేశించుకున్న లక్షాలను చేరుకోవడానికి నిబద్దతతో పనిచేయాలన్నారు. మంచి పోలీస్ అధికారి కావాలంటే మంచి వక్తగా సైతం మారాలని , మనలె ఉన్న ప్రతిభకు మరింత పదును పెడుతూ అందుకు అనుగుణమైన ఆలోచనావిదానంతో విజయాలను పొందాలని చెప్పారు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య, గంజాయి అక్రమ రవాణా నిరోధించడం, అసాంఘిక కార్యకలాపాలపట్ల కఠినమైన వైఖరి అవలంభించడం ద్వారా వచ్చిన ఫలితాలు వృత్తిరీత్యా సంతోషాన్ని కలిగించాయని తెలిపారు. జిల్లాలో అన్నివర్గాలవారు , ప్రజా ప్రతినిధులు, అధికారులు, అన్ని స్థాయిల సిబ్బంది తనకు పూర్తిగా స హకరించారని , వారందరిని మర్చిపోలేనని ఆయన చెప్పారు.

అదన పు ఎస్పి నర్మద అధ్యక్షతన జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగగిరి,పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి,జిల్లా అధ్యక్షుడు జయరాజ్, డిఎస్పీలు సురేష్ కు మార్, రమణారెడ్డి, వెంకటేశ్వర్‌ఱెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, మొగిలయ్య, ఆర్‌ఐలు నర్సింహాచారి, స్పర్జన్‌రాజ్, శ్రీనివాస్, న ర్సింహ, కృష్ణారావు, సిఐలు గౌరునాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, రౌతు గోపి, నిగిడాల సురేష్, శంకరెడ్డి,చీర్ల శ్రీనివాస్, బి.సురేష్, తదితరుల తో పాటు ఎస్‌ఐలు , డిపివో సిబ్బంది పాల్గొని డిఐజి రంగనాధ్‌ను శా లువాలు , పూలమాలలు , బొకేలతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News