Sunday, May 5, 2024

శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనం నిలిపివేత..

- Advertisement -
- Advertisement -

కర్నూల్: జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 జనవరి 1వ తేదీన శ్రీశైలం మహాక్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ వేళల్లో మార్పు చేసినట్లు చెప్పారు. తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 3.30 వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల నుండి4.30 వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం ఉంటుందని, ఆ తర్వాత ప్రదోషకాల పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని జనవరి 1వ తేదీన స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు నిలుపివేసి, భక్తులందరూ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నట్లు ఈవో లవన్న వివరించారు.

Sparsha Darshan cancelled in Srisailam Temple 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News