Wednesday, May 8, 2024

భూములు రక్షించుకోవడానికి దేవాదాయశాఖ స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

 lands

 

17వ తేదీ నుంచి మార్చి 31వరకు భూముల పరిరక్షణకు చర్యలు
ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్… కబ్జాదారులపై కేసుల నమోదుకు ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : అన్యాక్రాంతమయిన ఆలయ భూముల రక్షించడానికి దేవాదాయ శాఖ సమాయత్తం అయ్యింది. ఈనెల 17వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆలయ భూముల పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేవాదాయ భూములను ఆక్రమించిన కట్టడాలను కూల్చివేయడంతో పాటు ఖాళీగా ఉన్న స్థలాలకు ఫెన్సింగ్ వేసి కాపాడుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అన్ని ఆలయాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో భూముల పరిరక్షణకు అన్ని ఆలయాల ఈఓలు సమాయత్తం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆలయ భూములను సర్వే చేయడానికి దేవాదాయ శాఖ అధికారులు సిద్ధం అయ్యారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయినట్టు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే చాలామంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకులు దేవాదాయ భూములను కబ్జా చేసి వాటిని అమ్ముకున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే అమ్మిన భూములపై కూడా పూర్తి స్థాయి వివరాలను ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు సేకరించే పనిలో పడ్డారు.

12వేల ఆలయాలు, 84వేల ఎకరాల భూమి
ప్రస్తుతం దేవుడి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో భూముల వివరాలను ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. పహాణీ, సర్వే రికార్డుల్లో ఆయా భూముల వివరాలను చేర్చి పకడ్భందీగా రికార్డుల నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వెలుగులోకి వచ్చిన దేవుడి మాన్యాలను అధికారులు ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఎండోమెంట్ భూములకు చెందిన వివరాలను యాజమాన్య హక్కు కాలమ్‌లో దేవుడి పేరుతో పాటు సదరు ఆలయం పేరును రాయాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం 12 వేల ఆలయాలకు సంబంధించి 84 వేల ఎకరాల భూములు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

క్రిమినల్ కేసులు నమోదు చేయండి
స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా దేవుడి భూములను కబ్జా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈక్రమంలోనే దేవుడి మాన్యాల పరిరక్షణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, కబ్జా దారులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్ట వద్దని, వారిపై కఠినంగా వ్యవహారించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ శాఖ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Special drive to protect lands
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News