Monday, May 6, 2024

త్వరలో కాచిగూడ నుంచి కాకినాడ టౌన్‌ల మధ్య ప్రత్యేక రైలు

- Advertisement -
- Advertisement -
అధునాతన వ్యవస్థతో అందుబాటులోకి….
ఈ ట్రైన్‌లో ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్, జనరల్,
సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే…
మరికొన్ని ప్రాంతాలకు ఇలాంటి రైళ్లు

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించారు. అందులో భాగంగా వన్‌వే రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైన్‌లో ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. కాచిగూడ -టు కాకినాడ మధ్య త్వరలో ప్రారంభించబోయే ఈ రైలును ఏ తేదీ నుంచి నడుస్తుంది అనేది ఇంకా అధికారులు ప్రకటించలేదు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా అధునాతన వ్యవస్థను ఈ రైలులో ఉపయోగించుకుంటున్నారు. దీంతో పాటు శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు కీలక ప్రాంతాలకు ఇలాంటి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Also Read: ప్రభుత్వ మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News