Friday, May 3, 2024

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో మన ఊరు మన బడి, రెండు పకడల గదుల ఇండ్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ, మిషన్ భగీరథ పనులపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలల పనులను వేగవంతం చేసి 15రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 30 లక్షలలోపు ఉన్న పనులు ఆలస్యం చేయకుండా సత్వరమే పూర్తి చేయాలని పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మండలాల వారిగా ఇంకా పెండింగ్ ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి విడతలో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పరీపల్లి పాఠశాలకు పెయింటింగ్ వేయడంలో నిర్లక్షం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులపై సమీక్ష చేస్తూ నాగర్‌కర్నూల్ నుండి వనపర్తి రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యతలో లోపం లేకుండా చూడాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం వస్తుందని రోడ్లు ముందుగానే పూర్తి చేయాలని అదే విధంగా ఎక్కడైనా మరమ్మతు పనులు ఉంటే వాటిని సైతం త్వరలో పూర్తి చేయాలని సూచించారు.

పానుగల్ వైపు గల రోడ్ల మరమ్మతు పనులను తరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీలలో చేపట్టిన సిసి రోడ్లు, వైకుంఠ ధామం పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్‌ల పనులను త్వరగా పూర్తి చేసి ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. మక్తల్, కొత్తకోట ఇతర గ్రామాలకు త్రాగునీరు సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను ఆగష్టు చివరి నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే పూర్తి అయిన వాటికి విద్యుత్ సరఫరా ఇచేచ విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, రహదారులపై ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని మొక్కలను సంరక్షించేందుకు బాధ్యులను నియమించాలని సూచించారు. జిల్లాలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఈడబ్లూ ఐడిసి రామ్ చంద్రమ్, టిఎస్‌ఎం ఐడిసి జైపాల్ రెడ్డి, పంచాయతి రాజ్ ఈఈ మల్లయ్య, మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి, ఆర్‌అండ్ బి ఈఈ దేశ్యా నాయక్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News