Friday, April 26, 2024

యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్సు టెర్మినల్

- Advertisement -
- Advertisement -

Spiritual Bus Terminal in Yadadri

 

150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపోల నిర్మాణం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆధ్యాత్మిక బస్ టెర్మినల్‌ను కొండ కింద ఆలయానికి సమీపంలో సుమారు 7 ఎకరాలలో నిర్మించనున్నుట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. సైదాపురం గ్రామ శివారులో 150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపోకు కావల్సిన స్థలాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్‌శర్మతో పాటు స్థానిక ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. యాదాద్రికి ప్రపంచ స్థాయి గుర్తింపు వసతులు సైతం ఇదే స్థాయిలో ఉంటాయని వారు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు, బస్ టెర్మినల్‌లో ప్రయాణికులకు కావాల్సిన అన్ని వసతులు వచ్చే విధంగా నమూనాలను తయారు చేసి కెసిఆర్‌కు అందజేస్తామని తెలిపారు.

సిఎం ఆమోదంతో బస్‌స్టేషన్, డిపో నిర్మాణాలను చేపడతామని తెలిపారు. ఆలయ ప్రారంభానికి ముందే బస్ టెర్మినల డిపోలను ప్రారంభించడానికి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి అధికారులకు ఆదేశించారు. ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకమైన స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మరో స్టేషన్ నిర్మాణం నూతన బస్ టెర్మినల్‌లో నిర్మించేలా ఇంజినీర్లు, ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సుశీల్ శర్మ, కలెక్టర్ అనితా రామచంద్రన్, రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, పి.వి.మునిశేఖర్, నల్గొండ ఆర్‌ఎం వెంకన వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఓ గీత, ఆర్ అండ్ బి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News