Saturday, May 4, 2024

యాదాద్రి ఆలయాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోతారు

- Advertisement -
- Advertisement -

ఎక్కడా రాజీ పడకుండా, తొందర పడకుండా
ఆలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పునఃనిర్మించారు

Spiritual ocean in Yadadri Temple

 

మనతెలంగాణ/హైదరాబాద్:  శ్రీ లక్ష్మినరసింహ స్వామి వైభవాన్ని ప్రపంచంలో నలుదిక్కులా చాటేలా సిఎం కెసిఆర్ కృషి చేశారని, అందులో భాగంగా యాదాద్రి ఆలయాన్ని పునః నిర్మించారని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని మినిస్టర్ కార్యాలయంలో ఆదివారం ఆర్‌ఆర్‌ఆర్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు రూపొందించిన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వీడియో సిడిని మంత్రి విడుదల చేశారు.

ఈ వీడియో భక్తులకు ఉపయోగపడుతుందని దీనిని రూపొందించిన నిర్వాహకులను మంత్రి అభినందించారు. యాదాద్రి పునఃనిర్మాణ చరిత్రను తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడాలని మంత్రి సూచించారు. యాదాద్రి పునః నిర్మాణంతో శ్రీ లక్ష్మినరసింహా స్వామి దర్శనానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని, నేడు (28వ తేదీ) ఉదయం శుభ ముహర్తంలో మహా కుంభ సంప్రోక్షణ అనంతరం కోట్లాది మంది కొంగు బంగారమైన శ్రీ లక్ష్మి నరసింహా స్వామి ప్రధానాలయ ద్వారాలు తెరుచుకుంటాయన్నారు. నేడు సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తుల దర్శనాలు తిరిగి ప్రారంభం అవుతాయన్నారు. పునః నిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోవడం ఖాయమని, అంత రమణీయంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పునః నిర్మించారన్నారు. ఎక్కడా రాజీ పడకుండా, తొందర పడకుండా, దీక్షగా ఆలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పునఃనిర్మించారన్నారు. ప్రజలకు వెయ్యేళ్ల పాటు గుర్త్తుంచుకునేలా పాలించడం పాలకుల ప్రధాన లక్ష్యమని యాదాద్రి ఆలయాన్ని పూర్తి చేసిన కెసిఆర్ పేరు కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News