Tuesday, April 30, 2024

తొలి టెస్టులో పాకిస్థాన్ విజయం

- Advertisement -
- Advertisement -

గాలే: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం చివరి రోజు పాకిస్థాన్ 32.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 48/3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్ ఇమాముల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే బాబర్ 5 ఫోర్లతో 24 పరుగులు చేసి కీలక సమయంలో పెవిలియన్ చేరాడు.

కానీ షకిల్ సౌద్‌తో కలిసి హక్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన షకిల్ ఆరు ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వికెట్ కీపర్ సర్ఫరాజ్ (1) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. అయితే ఓపెనర్ ఇమాముల్ హక్ మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో పాక్‌కు విజయం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హక్ 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312, రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 461 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News