Monday, April 29, 2024

‘హిరణ్యకశ్యప’గా రానా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరో రానా దగ్గుబాటి శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా తన కొత్త చిత్రం ‘హిరణ్యకశ్యప’ని ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా పతాకంపై ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో రాక్షసరాజు హిరణ్యకశ్యపునిగా రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ “ఈ టైమ్‌లెస్ లెజెండ్స్ కథను ప్రేక్షకులతో పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన కథనాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News