Friday, April 26, 2024

టూరిజం అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట

- Advertisement -
- Advertisement -
Srinivas Goud inaugurates the International Travel Mart Exhibition
ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్
ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ట్రావెల్ మార్ట్‌లో ఏర్పాటు చేసిన 15 రాష్ట్రాల కు చెందిన టూరిజం స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఆయా రాష్ట్రాల్లోని టూరిజం ప్రాంతాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం అధికారులను ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రదేశాలపై ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహారించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పర్యాటక, చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగా కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత చారిత్రక, వారసత్వ సంపద రామప్ప దేవాలయంకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్ధ యునెస్కో వారసత్వ కట్టడాల జాబితా గుర్తింపు లభించిందన్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి మరో అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని బెస్ట్ టూరిజం విలేజ్‌గా గుర్తించిందన్నారు.

రూ.1400 కోట్లతో యాదాద్రి దేవాలయ నిర్మాణం

రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఆది మానవుడు జీవించి ఉన్నప్పటి నుంచి వందల, వేల ఏళ్ల నుంచి ఎంతో ఘనమైన, విలువైన చారిత్రక నేపథ్యం ఉన్న పర్యాటక ప్రదేశాలు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. సిఎం కెసిఆర్ టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా సుమారు 1400 కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయాన్ని నిర్మిస్తున్నారన్నారని మంత్రి తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల ప్రత్యేక కృషితో నేడు ప్రపంచంలోనే తెలంగాణ ఫార్మా, వ్యాక్సిన్ ఉత్పత్తులకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటకుల స్వర్గధామంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్, వివిధ రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, మాల్దీవిస్ టూరిజం, అండమాన్ టూరిజం అధికారులతో పాటు తెలంగాణ టూరిజం అధికారులు మహేష్, ఓంప్రకాష్, శశిధర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News