Tuesday, April 30, 2024

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రిని విద్యార్థుల ఘెరావ్

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: సర్కార్ ఉత్తర్వుల పే రిట ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా సీ ట్లను బ్లాక్ చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యునివర్సిటీ తెలంగాణ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రిని నాలుగు వైపులా చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. జీవోను అడ్డుపెట్టుకుని కళాశాల యజమాన్యాలు లక్షల కొద్ది ఫీజులు గుంజుకుంటూ మాఫియా దందాగా మార్చేశారంటూ, వారిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనను ప్రశ్నించి. నిలదీశారు. సోమవారం మసాబ్‌టాం క్ వద్ద రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఛాంబర్‌లోకి వారు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ లోపలికి చొరబడ్డారు. ఈ క్రమంలో భద్రత సిబ్బంది అడ్డుకోగా నిరసనకారులు తీవ్ర స్థాయిలో ఆ గ్రహం వెళ్లగక్కారు. ఈక్రమంలో వారితో వాగ్వాదాదాలకు దిగడం కొద్దిసేపు గందరగోళ పరిస్థితికి దారితీసింది. సీట్లను అమ్ముకుంటూ విద్యను వ్యాపారపరం చేశారం టూ ప్లకార్డులతో విద్యార్థులు కదం తొక్కారు.

70 శాతం కన్వీనర్ కోటా ఆడ్మిషన్లను కన్వీనరే చేపట్టాలి, అక్రమ పద్దతులతో సీట్లను బ్లాక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియను పున ప్రకటించాలి, బీ కేటగిరీ ఆడ్మిషన్ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా ఎంజెట్ కన్వీనర్ నిర్వహించే వి ధంగా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు లెవనెత్తిన డిమాండ్లను సానుకూలంగా స్పందించి ఆచార్య లింబాద్రి త్వరలో మంత్రితో మాట్లాడి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ సందర్బంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ డాక్టర్ భట్టు శ్రీహరి మాట్లాడుతూ ఇంజినీరింగ్ సీట్ల కౌన్సెలింగ్‌ను ఎడుదఫాలుగా నిర్వహించాలి, వారి ఆగడాల వల్ల విద్యార్థులు నష్ఠపోతున్నారని దుయ్యబట్టారు. సీట్లను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసి అడ్డదారుల్లో ఇతరులకు అప్పన్నంగా అమ్ముకుంటూ ఉన్నత విద్యావ్యవస్థను వ్యాపారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇలా ఇప్పటివరకు వేల సీట్లను లక్షల రూపాయలు దండుకుని విక్రయించారని ఆరోపించారు. ప్రతిభ కల్గిన విద్యార్థుల జీవితాల తో ఆటలు ఆడుకుంటున్న కళాశాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని శ్రీహరి డిమాండ్ చేశారు. నిరసనలో నాయకులు శ్రీశైలం గౌడ్, నవీన్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్, నాగరాజ్, నాగయ్య స్వా మి, ప్రశాంత్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News