Monday, April 29, 2024

ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారం దిశగా అధికారుల సమన్వ యంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆర్‌డిఓ రాజేశ్వర్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆసిఫాబాద్ మండ లం పర్సనంబాల గ్రామానికి చెందిన సౌందర్య తనకు నివాస గృహం లేదని గృహలక్ష్మి పథకం ద్వారా సహాయం చేయాలని కోరారు. కాగజ్‌నగర్ పట్టణంలోని అశోక్‌నగర్ లో నివాసం ఉంటున్న జీవరత్నం తనకు 66 సంవత్సరాలు ఉన్నాయని, పెన్షన్ మంజూరు చేయా లని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన గోపాల్ తనకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందజేయాల ని వినతిపత్రం అందజేశారు. తిర్యాణి మండలం కౌటగాం గ్రామానికి చెందిన అమృతరావు తనకు మహత్మ గాంధీ ఉపాధిహామి పథకం ద్వారా రావాల్సిన మొత్తం 8 వారాల నుండి రావడం లేదని వెంటనే మొత్తం డబ్బులు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News