Saturday, April 27, 2024

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు : జిల్లా కలెక్టర్ సంగీత

- Advertisement -
- Advertisement -

జిల్లాలో విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడకుండా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యల పై డిసిపి సిహెచ్. రూపెష్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన డ్రగ్ అడిక్షన్ కేసులు వివరాలను ఆరా తీశారు. జిల్లాలో మైనర్ విద్యార్థులను డ్రగ్స్, గంజాయి సరఫరా కొరకు వినియోగి స్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. జిల్లాలో మండలాల వారీగా మైనర్లు పాల్గొన్న మాదక ద్రవ్యాల కేసుల సంపూర్ణ వివరాలు శనివారం నాటికి సిద్దం చేయాలని, కేసుల వారీగా సమీక్ష నిర్వహించాలని తెలిపారు.

జిల్లాలో ఉన్న పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రహరి క్లబ్స్, వాటి పని తీరుపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. విద్యాలయాలకు వంద గజాల దూరంలో మద్యం షాపులు ఉండాలని, బెల్ట్ షాపులు ఏమైనా కంప్లైంట్ వస్తె మూసి వేయించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్కూల్ కు దగ్గర ఉన్న కిరాణా, పాన్ షాపులను తనిఖీ చేయాలని, అక్కడ సిగరెట్, పొగాకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం ఉన్న పిల్లలను బాధితులుగా పరిగణించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, దీని కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకలాజిస్ట్ సేవలు విస్తృతంగావినియోగించు కోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి సిగరెట్లు, 21 వయస్సు లోపు గల వారికి మధ్యం విక్రయించడానికి వీలు లేదని, జిల్లాలో ఉన్న మధ్యం షాపులు, పాన్ డబ్బాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సిసి కెమేరాల వివరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న 500 పైగా మెడికల్ షాపులలో హెచ్ డ్రగ్స్ అమ్మకాలు డిజిటల్ విధానం ద్వారా మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, జువెనైల్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News