Sunday, May 19, 2024

ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పటిష్టమైన శాంతి భద్రతలు

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ జిల్లా: జిల్లాలో ప్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పటిష్టమైన శాంతి భద్రతలు ఏర్పడ్డాయని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. పెట్రో కార్స్, బ్లూ కోల్డ్ వాహనాల ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్‌కుమార్ మాట్లాడుతూ పోలీసులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారు. నేర రహిత సమాజ స్థాపనకు ప్రజలతో ఫ్రెండ్లీగా, నేరస్తులకు సింహా స్వప్నంలా తెలంగాణ పోలీసులు ఉన్నారని అన్నారు. తెలంగాణలో పటిష్టమైన వ్యవస్థతో కూడిన కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం యావత్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని కలెక్టర్ తెలిపారు.

పోలీసులు శాంతి భద్రతలకే పరిమితం కాకుండా హరితహారం వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలలో క్రీయాశీలకంగా మమేకం అవుతున్నారని, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములు అవుతున్నారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డీసీపీ సందీప్, ఏసీపీ రామలింగరాజు, పోలీసు సిబ్బంది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిభిషన్, డాక్యుమెంటేషన్‌ను ఆదివారం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి కలెక్టర్ ఫోటో ఎగ్జిభిషన్, డాక్యమెంటరీనిను తిలకించారు. 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరిగిన అభివృద్దిని వివరిస్తూ ఫోటో ఎగ్జిభిషన్, డాక్యుమెంటరీని తీర్చిదిద్దారు.

దశాబ్ది ఉత్సవాలలో అందరిని భాగస్వాములను చేయాలి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో అందరిని భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో రోజుల వారి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన తెలంగాణ సంక్షేమ సంబురాలతో పాటు 13వ తేదీన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, మహిళా సదస్సులు వైభవంగా నిర్వహించాలని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే తెలంగాణ సంక్షేమ సంబురాలలో ఆసరా పింఛన్, కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులు వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

నియోజవర్గ కేంద్రాలలో ఈనెల 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాలను నిర్వహించాలని, అంగన్‌వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బందితో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని జిల్లా సంక్షేమ అధికారి పావనిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి పద్మజారాణి, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, కీసర ఆర్డీవో రవి, జిల్లా ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News