Saturday, April 27, 2024

హరేన్‌ పాండ్య హత్యలా మోడీ, అమిత్‌షా నాపై కుట్రకు యత్నం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పార్టీనేత అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ పాలనలోని లోపాలను తరచుగా ఎత్తిచూపడం ఆయనకు పరిపాటి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షా తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని సోమవారం సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా 2003 మార్చి 26న మాజీ గుజరాత్ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్యకు గురైన సంఘటనను ప్రస్తావించారు. హరేన్ పాండ్యా మాదిరిగా తనపై మోడీ, అమిత్‌షా కుట్రకు పాల్పడరని భావిస్తున్నానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. అలా అయితే తాను తన స్నేహితులను అప్రమత్తం చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆయన ఆగలేదు. “గుర్తుంచుకోండి!..నేను ఎంత మంచిని సంపాదిస్తానో అంత మంచినంతా ఇస్తాను” అని హెచ్చరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో అత్యున్నత అధికారంలో ఎవరైతే ఉన్నారో వారిని మోడీ, అమిత్‌షా మోసగించారని స్వామి ఆరోపించారు.
ఎవరీ హరేన్ పాండ్య ?
హరేన్ పాండ్య గుజరాత్ మాజీ హోం మంత్రి. అహ్మదాబాద్ లా గార్డెన్స్‌లో 2003 మార్చి 26న ఉదయం 7.40 గంటల ప్రాంతంలో ఆయన మోర్నింగ్ వాక్ పూర్తి చేసుకున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారు. ఐదు తూటాలు ఆయనను బలిగొన్నాయి. ఆయన మృతదేహం రెండు గంటల పాటు కారులో అలాగే పడి ఉంది. వికిపీడియా వివరాల ప్రకారం ఆయన హత్య అత్యంత వివాదాస్పదంగా తయారైంది. ఈ హత్యకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, అలాగే అప్పటి కేంద్ర ఉప ప్రధాన మంత్రి ఎల్‌కె అద్వానీ,తదితర బిజేపి అగ్రనేతలపై ఆర్‌ఎస్‌ఎస్ నుంచి అనుమానాలు కూడా వచ్చాయి. పాండ్యా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు. పాండ్యాను పక్కన పెట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు ప్రాణహాని ఉందని బెదిరింపులు వచ్చినప్పటికీ సరైన భద్రత కల్పించలేదు. జాగ్రత్తగా ఉండాలని అప్పటి ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ కూడా పాండ్యాను హెచ్చరించారు. గోధ్రా అల్లర్లను దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు పాండ్యా విషయం తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదు.

2002లో గోధ్రా అల్లర్లు జరిగిన తరువాత క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అల్లర్లకు బలైన బాధితుల మృతదేహాలను అహ్మదాబాద్‌కు తీసుకురాడానికి పాండ్యా వ్యతిరేకించారు. ఎందుకంటే ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్నది పాండ్యా అభిప్రాయం. బాధితుల కుటుంబీకులకు, ముస్లిం నేతలకు మధ్య శాంతి చర్చల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయగల ఏకైక వ్యక్తి పాండేయే. కానీ ఆ సమావేశంలో కొంతమంది మంత్రులు ఈ ప్రయత్నానికి పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సుబ్రహణ్యస్వామి పాండ్యా హత్యను మళ్లీ ప్రస్తావించడం, అందులో తనపై మోడీ, అమిత్‌షా కుట్ర పన్నడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Subramanian Swamy claims Modi and Shah Planning kill him

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News