Thursday, May 16, 2024

‘మెగా 154’ సెట్స్‌లో సుకుమార్

- Advertisement -
- Advertisement -

 

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, శృతిహాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. దర్శకుడు సుకుమార్ మెగా154 సెట్స్‌ని సందర్శించారు. సుకుమార్ సెట్స్‌లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది చిత్ర యూనిట్. బాబీ… సుకుమార్‌కి ల్యాప్‌టాప్‌లో ఏదో చూపించడం, సుకుమార్ ఆసక్తికరంగా చూడటంలో ఈ చిత్రంలో గమనించవచ్చు. మెగా154 బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్‌తో శృతి హాసన్ ఈ చిత్రం కోసం తొలిసారి జతకట్టింది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News