Saturday, May 4, 2024

ఆర్నాబ్‌కు తాత్కాలిక బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Supreme Court extends interim bail to Arnab Goswami

న్యూఢిల్లీ: ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లిని ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణపై అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించిన నాలుగవ వారాల వరకు వారికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం పొడిగించింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు ఇందుకు సంబంధించి 55 పేజీల ఉత్తర్వులను జారీచేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కని పేర్కొంది.

బెయిల్ మంజూరులో హైకోర్టులకు గల అధికారాలు, ఎఫ్‌ఐఆర్ కొట్టివేత, మానవ స్వేచ్ఛ పరిరక్షణలో కోర్టుల పాత్ర తదితర అనేక అంశాలను ధర్మాసనం తన ఉత్తర్వులో ప్రస్తావించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులను వేధించడానికి క్రిమినల్ లా ఆయుధం కాకుండా చూసుకోవలసిన బాధ్యత జిల్లా న్యాయస్థానం, హైకోర్టులు, సుప్రీంకోర్టుతో సహా అన్ని న్యాయస్ధానాలకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తనకు బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఒక లేఖ రాసి 2018లో అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్నాబ్ గోస్వామితోపాటు నీతిష్ శారద, ఫిరోజ్ మొహమ్మద్‌లను మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని అలీబాగ్ పోలీసులు నవంబర్ 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
———–

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News