Monday, April 29, 2024

53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

761 new covid-19 cases reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 43 వేల 260 మందికి టెస్టులు పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా గురువారం 42, 242 మందికి టెస్టులు చేయగా మరో 761 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 136 ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 33, జగిత్యాల 21, జనగాం 2, భూపాలపల్లి 9, గద్వాల 7, కామారెడ్డి 12, కరీంనగర్ 32,ఖమ్మం 28, ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 10, మహబూబాబాద్ 17, మంచిర్యాల 29, మెదక్ 14 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 69, ములుగు 18, నాగర్‌కర్నూల్ 9, నల్గొండ 28, నారాయణపేట్ 4, నిర్మల్ 2, నిజామాబాద్ 19, పెద్దపల్లి 18, సిరిసిల్లా 28, రంగారెడ్డి 55, సంగారెడ్డి 18, సిద్ధిపేట్ 30, సూర్యాపేట్ 33, వికారాబాద్ 11, వనపర్తి 5, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ లో 24, యాదాద్రిలో మరో 18 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,67,665కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,55,378కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

14,404 బెడ్లు ఖాళీలు….

రాష్ట్రంలో కరోనా వైద్యం అందించే ప్రైవేట్, సర్కార్ దవాఖానాల్లో 14,404 బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోని 61 కోవిడ్ ప్రత్యేక హాస్పిటల్స్‌లో 1409 ఐసోలేషన్, 4845 ఆక్సిజన్, 1502 వెంటిలేటర్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 220 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 1799 ఐసోలేషన్, 2640 ఆక్సిజన్, 2209 వెంటిలేటర్ పరుపులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత రెండు నెలలతో పోల్చితే దాదాపు 50 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

761 new covid-19 cases reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News