Wednesday, May 1, 2024

అయోధ్య భూ కుంభకోణంపై సుప్రీం విచారణ చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

Supreme Court should conduct an inquiry into Ayodhya land scam

సుమోటాగా చేపట్టాలని కాంగ్రెస్ వినతి

న్యూఢిల్లీ: అయోధ్యలో భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తనకు తానుగా(సుమోటో) విచారణ చేపట్టాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని వీడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నగర మేయర్, స్థానిక బిజెపి ఎమ్మెల్యే, బిజెపి మాజీ ఎమ్మెల్యేతోసహా 40 మంది అయోధ్యలో చట్ట విరుద్ధంగా ఇంటి స్థలాలను విక్రయిస్తూ అక్కడ మౌలిక సౌకర్యాలను నిర్మిస్తున్నారంటూ అయోధ్య అభివృద్ధి సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ మర్యాద పురుష్తోమ శ్రీరాముడి పేరిట బిజెపి కుంభకోణానికి పాల్పడింది. హోం మంత్రి అమిత్ షా దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..అయోధ్యలో భారీ ఆస్తి కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

అయోధ్యలో భూ కుంభకోణం జరుగుతోందని 2021 జూన్ నుంచి తాము చెబుతున్నామని, ఇప్పుడు అయోధ్య అభివృద్ధి సంస్థే రామాలయ నిర్మాణంలో భూ కుంభకోణం జరిగిందంటూ 40 మంది నిందితుల పేర్ల జాబితాను విడుదల చేసిందని శ్రీనాథ్ తెలిపారు. ఈ జాబితాలో అయోధ్యకు చెందిన బిజెపి ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, బిజెపి మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ, బిజెపి మాజీ ఎమ్మెల్యే గోరఖ్‌నాథ్ బాబా, యుపి ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు ఉన్నారని ఆమె తెలిపారు. భగవంతుడిపై విశ్వాసంతో ప్రజలు విరాళాలు అందచేశారని, ఆ డబ్బు చోరీకి గురవుతోందని ఆమె ఆరోపించారు. బిజెపి నాయకులు తక్కువ ధరకు భూమిని కొని ఎక్కువ ధరకు అయోధ్య రామాలయ ట్రస్టుకు ఎందుకు అమ్ముతున్నారని, ఇందులో ట్రస్టు సభ్యుల పాత్ర కూడా ఉందని ఆమె అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News