Wednesday, May 1, 2024

అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్డు విద్యా చట్టం-2004 సెక్యూలర్ సిద్ధాంతంను, రాజ్యాంగంలోని 14 వ ఆర్టికల్ కింద ఇచ్చిన ప్రథామిక హక్కులను ఉల్లంఘిస్తోంది కనుక ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే విధించింది.

హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. తుది విచారణను జూలై రెండో వారం విచారిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నిర్ణయించారు. ధర్మాసనంలో న్యాయమూర్తులు జెబి. పార్ధివాలా, మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(1) పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే ఏ విద్యాసంస్థలో మతపరమైన బోధన అందించరాదని , ఆర్టికల్‌లో ఉపయోగించినట్లుగా ‘మతపరమైన బోధన’ అనే వ్యక్తీకరణను వివరించే 2002 తీర్పును సూచించిందని కోర్టు ఎత్తి చూపింది.  చట్టంలోని నిబంధనలను కొట్టివేస్తూ విద్యార్థులందరినీ రాష్ట్రానికి ఇతర ప్రాంతానికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News