Saturday, May 4, 2024

సుప్రీం తీర్పు నిరాశ పర్చింది : పీపుల్స్ కాన్ఫరెన్స్‌చీఫ్ సజాద్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : రాజ్యాంగం లోని ఆర్టికల్ 370 నిబంధనలను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం నిరాశ పర్చిందని, న్యాయం మళ్లీ జమ్ము కశ్మీర్ ప్రజలకు దూరమైందని పీపుల్స్ కాన్ఫరెన్స్ (పిసి) చీఫ్ సజాద్ లోనె సోమవారం వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ను చట్టబద్ధంగా నిర్మూలించినా, మా రాజకీయ ఆకాంక్షల్లో నిలిచే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర హోదా విషయం లో దానిపై వ్యాఖ్యానించడానికి కూడా సుప్రీం కోర్టు పక్కదారి పట్టిందని ఆరోపించారు. భవిష్యత్ దుర్వినియోగం కాకుండా ప్రాధాన్యతను పేర్కొనడం ద్వారా మొత్తం దేశాన్ని కాపాడిందని వ్యాఖ్యానించారు. అయితే అదే దుర్వినియోగం జమ్ముకశ్మీర్‌లో సూక్ష్మంగా ఆమోదించబడిందని పేర్కొన్నారు. నెపం అనే నిద్ర నుంచి న్యాయం భవిష్యత్తులో ఏదో ఒక రోజు మేల్కొంటుందని మనం ఆశిద్దామని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News