Friday, April 26, 2024

పరీక్ష హాల్‌లో ప్రసవించిన విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ఇంటర్ పరీక్ష హాల్‌లో ఓ విద్యార్థిని (16) ప్రసవించిన సంఘటన తమిళనాడులోని నమ్మకల్ జిల్లా నమగిరిపట్టాయ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలిక తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటుంది. బాలిక ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ (తమిళనాడులో స్కూల్ పిల్లలుగా పరిగణిస్తారు) చదువుతోంది. సదరు బాలిక ఎగ్జామ్ రాస్తుండగా కడుపులో నొప్పి రావడంతో ఇన్విజిలెటర్ అడిగి వాష్ రూమ్‌కు వెళ్లింది. 30 నిమిషాలైన బాలిక తిరిగిరాకపోవడంతో వాష్‌రూమ్ ఇన్విజిలెటర్ వెళ్లాడు. బాలికకు రక్త స్రావం కావడంతో హెడ్‌మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు. హెడ్‌మాస్టర్ 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక ఎనిమిది నెలల గర్భవతి అని తెలిపారు. సాలెమ్ గవర్నమెంట్ మోహన్ కుమారమంగళం వైద్యశాలలో సుఖ ప్రసవం ద్వారా పండంటి బిడ్డకు బాలిక జన్మనిచ్చింది. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితి విషమంగా లేదని వైద్యులు వెల్లడించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలిక పక్కింట్లో ఉన్న వీరన్ అనే (70) వృద్ధుడు ఆమెపై అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాలుపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి వీరన్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Tamil nadu Girl delivered in exam hall in Namakkal

 

Tamil nadu Girl delivered in exam hall in Namakkal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News