Saturday, April 27, 2024

అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

 

Corona

 

ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కరోనా నుంచి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు సహకరించాలని లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 694కు చేరుకున్నాయి. ఈ వైరస్‌లో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసులు వివరాలు… మహారాష్ట్ర (125), కేరళ (118), కర్నాటక (55), తెలంగాణ (44), గుజరాత్ (43), యుపి(42), రాజస్థాన్ (40), ఢిల్లీ(36), పంజాబ్ (33), హర్యానా(32), తమిళనాడు(26)గా నమోదయ్యాయి. తెలంగాణలో 44 మందికి కరోనా వైరస్ సోకింది.

 

All indians are maintain distance in Corona virus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News