Wednesday, May 1, 2024

సెంచరీతో విరుచుకుపడిన సూర్య.. కివీస్ పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

సెంచరీతో విరుచుకుడిన సూర్య.. కివీస్ పై భారత్ ఘన విజయం
నాలుగు వికెట్లతో మెరిసిన దీపక్‌హుడా.. కేన్ అర్ధశతకం వృథా
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్

మౌంట్‌మాంగనూయ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌లో టి20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా రెండో టి20లో హార్దిక్ సేన సత్తా చాటి 65 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. న్యూజిలాండ్ గడ్డపై మిస్టర్ 360 సూర్యకుమార్ 217.65 స్ట్రైక్ రేటుతో 51బంతుల్లోనే 111 సూపర్ సెంచరీ నమోదు చేసి భారతజట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈక్రమంలో టి20ల్లో రెండో సెంచరీ నమోదుచేసిన సూర్య పొట్టి ఫార్మాట్‌లో రెండు శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. టి20ల్లో ఓ బ్యాటర్ రెండు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. ఇదే ఏడాది ఇంగ్లండ్‌పై 55బంతుల్లో 117పరుగులు చేసి సెంచరీ నమోదు చేసిన సూర్య, ఆదివారం కివీస్‌పై రెండో సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు భారత బౌలింగ్ దళం కూడా విజృంభించడంతో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ప్రధానంగా దీపక్‌హుడా 10పరుగులిచ్చి పడగొట్టి న్యూజిలాండ్ విజయాన్ని అడ్డుకున్నాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61) హాఫ్‌సెంచరీ, బ్లాక్‌క్యాప్స్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ హ్యాట్రిక్ నమోదు చేసినా భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.

సూర్య @111
భారత్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇషాన్ కిషన్, పంత్ జోడీ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పంత్ విఫలమయ్యాడు. 13బంతుల్లో ఓ బౌండరీతో 6పరుగులు మాత్రమే చేసి ఫెర్గూసన్ బౌలింగ్‌లో సౌథీ చేతికి దొరికిపోయిన పంత్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. 36పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. ఇషాన్ కిషన్, సూర్య జోడీ స్కోరుబోర్డును పరుగెత్తించింది. 31బంతుల్లో 5ఫోర్లు, ఓ సిక్స్‌తో 36పరుగులు చేసిన ఇషాన్ కిషన్..ఇష్‌సోధీ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 69పరుగులు వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ దురదృష్టవశాత్తుఫెర్గూసన్ బౌలింగ్‌లో హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సౌథీ విజృంభించి హ్యాట్రిక్ నమోదు చేశాడు. హార్దిక్ (13)తోపాటు దీపక్‌హుడా, సుందర్‌లను డకౌట్ చేశాడు. మొత్తంమీద బ్యాటింగ్ చేసిన నిర్ణీత 6వికెట్లు కోల్పోయి చేసింది. 51బంతుల్లో 11ఫోర్లు, 7సిక్సర్లతో 111పరుగులు చేసిన సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచాడు.

సౌథీ హ్యాట్రిక్
బ్లాక్ క్యాప్స్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ టీ20ల్లో రెండోసారి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ సౌథీ చివరిఓవర్లో వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. 20వ ఓవర్ మూడో బంతికి కెప్టెన్ హార్దిక్ పాండ్య నాలుగో బంతికి దీపక్‌హుడా ఐదోబంతికి సుందర్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. 190పరుగుల స్కోరు వద్ద భారతజట్టు ఒకేసారి మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సౌథీ నాలుగు ఓవర్లలో 34పరుగులిచ్చి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా అంతర్జాతీయ టి20ల్లో శ్రీలంక మాజీ కెప్టెన్, పేసర్ లసిత్ మలింగ మాత్రమే రెండుసార్లు హ్యాట్రిక్ నమోదు చేయగా సరసన నిలిచాడు.

భారత బౌలర్ల విజృంభణ
భారత్ నిర్దేశించిన లక్ష ఛేదనలో న్యూజిలాండ్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిన్‌అలెన్(0)ను మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ డకౌట్‌చేశాడు. వికెట్‌కీపర్ కాన్వే, కెప్టెన్ కేన్ భారత బౌలర్లను అడ్డుకుని ఆదుకున్నారు. ఈ జోడీని విడదీసి కాన్వే (25)ను సుందర్ ఔట్ చేయడంతో కివీస్‌కు షాక్ తగిలింది. ఒంటరి పోరాటం కేన్‌కు సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. 52బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులతో 61పరుగులు చేసిన కేన్‌ను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈక్రమంలో బౌలర్లు ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయిన కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీపక్‌హుడా నాలుగు వికెట్లు తీసి మెరవడంతో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో చేసి దీపక్‌హుడా 4వికెట్లు, సిరాజ్, చాహల్ చెరో రెండు వికెట్లు, భువీ,సుందర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. రెండో టి20ని 65పరుగులు తేడాతో భారత్ సొంతం చేసుకోగా సూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Team India beat New Zealand by 65 runs in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News