Tuesday, May 7, 2024

బాక్సింగ్‌డే టెస్టు భారత్‌దే

- Advertisement -
- Advertisement -

Team India won second test in Ind vs Aus

మెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో (బాక్సింగ్ డే టెస్టు) భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (35), రహానే (27) పరుగులు చేశారు. రెండో వికెట్ పై రహానే, గిల్ 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ అజింక్య రహానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  అవార్డు దక్కింది. మొదటి ఇన్నింగ్స్ లో రహానే అద్భుతమైన సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నాడు. నాలుగు రోజు ఆట ప్రారంభించగానే భారత జట్టు 19 పరుగులకే రెండు కీలక వికెట్లు పొగొట్టుకుంది. మయాంక్ అగర్వాల్ ఐదు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో పెయిన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఛటేశ్వరా పూజారా మూడు పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటి వరకు 1-1తో టీమిండియా ముందుకు వెళ్తోంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195

భారత్ తొలి ఇన్నింగ్స్: 326

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 200

భారత్ రెండో ఇన్నింగ్స్: 70

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News