Saturday, September 30, 2023

లవ్… నవవధువు అత్తగారింట్లో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Bride commit suicide

 

వరంగల్: ప్రియుడితో పెళ్లి చేయలేదని అత్తవారింట్లో నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమరదేవపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నారాయణగిరికి చెందిన రవళి అనే యువతిని మాణిక్యపూర్ గ్రామానికి చెందిన రాజుకి డిసెంబర్ రెండో వారంలో పెళ్లి చేశారు. యువతి గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది. రవళి ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులు గోప్యంగా ఉంచి ఆమెకు పెళ్లి చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ ఆ యువతి అత్తగారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరు బాధ్యులు కాదని, అమ్మా అన్నీ నీకు తెలుసు… కులం, మతం చూడొద్దని వేడుకుంది. భర్తకు క్షమాపణ చెప్పింది. మాణిక్యపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News