Saturday, May 11, 2024

10లక్షల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -
Telangana accounts for 5 percent of country's GDP
మూడేళ్లలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు
దేశ జనాభాలో 5శాతం వాటా తెలంగాణదే

ప్రపంచంలోని 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి, ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కాదు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడున్న రూ.1.94లక్షల తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.27లక్షలకు పెరిగింది, పెట్టుబడులకు రాష్ట్రం తొలి చాయిస్‌గా మారింది, నూతన ఐటి పాలసీ ఆవిష్కరణ సభలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ జిడిపిలో 5శాతం వాటా తెలంగాణదే, అత్యధిక జిడిపి గల రాష్ట్రాలలో మనం 4వ స్థానంలో ఉన్నామని, దీంతోపాటు ఐటీ రంగం వార్షిక వృద్ధిలో రాష్ట్రం మొదటిస్థానం అలంకరించిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ముందుకెళుతున్నామని కెటిఆర్ తెలిపారు. గురువారం హెచ్‌ఐసిసిలో రెండో ఐటి పాలసీ విధానాన్ని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. 2026 వరకు ఐదేళ్ల పాటు ఐటి నూతన విధానం అమల్లో ఉండనుంది. దీంతోపాటు మెంటర్ టు గెదర్ అనే సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్న టాస్క్- తెలంగాణ స్టార్టప్ వెబ్‌సైట్, నేషనల్ ఆడిటివ్ మ్యాన్యుఫాక్చరింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.

తలసరి ఆదాయం రూ. 2.27లక్షలు

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఐటి రంగానికి సంబంధించి వార్షిక వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మం త్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయ ని ఆయన వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 1.94 లక్షలు ఉన్న తలసరి ఆదాయం కాగా ప్రస్తుతం రూ. 2.27 లక్షలకు పెరిగిందని కెటిఆర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఐటి రంగం ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. త్వర లో టీ-వర్స్‌ను ప్రారంభిస్తామని ఆయన తెలియచేశారు. ఇప్పటివరకు 3 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు గణాంకాలతో సహా ఆయన వెల్లడించారు. ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. స్టార్టఫ్‌లు, పెట్టుబడులకు తెలంగాణ మొదటి చాయిస్‌గా మారిందన్నారు. సాధికారత దిశగా రాష్ట్రం ఏర్పడినప్పటితో పోలి స్తే ఐటి ఎగుమతులు రెట్టింపయ్యాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో తలసరి ఆదాయం ఏడేళ్లలో దాదాపు రెట్టింపయిందన్నారు. తలసరి ఆదాయంలో జాతీ య సగటు కంటే రాష్ట్రం లో ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటికంటే ఐటి ఎగుమతులు రెండింతలు అయ్యాయని ఆయన వెల్లడించారు. 201314లో రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటి ఎగుమతులు, 2020-21 నాటికి రూ.లక్షా 45 వేల కోట్లకు పెరిగాయన్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఐదు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మంత్రి తెలిపారు. 15 వందల స్టార్టప్‌లకు సాయం అందించామని, టాస్క్ ద్వారా మూడు లక్షల మందికి పైగా నిపుణులను తయారు చేశామన్నారు. ఐదు వందలకు పైగా ప్రభుత్వ సేవలు మీ సేవ ద్వారా అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. స్మార్ట్ గవర్నమెంట్ విభాగంలో తెలంగాణ జాతీయ అవార్డులు గెలుచుకుందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని 5 లక్షల మందికిపైగా డిజిటల్ ఎడ్యుకేషన్ అందించామన్నారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి రూ.13 వందల కోట్లతో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామన్నారు. 7 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. పౌరులు ఈ కొత్త పాలసీ ద్వారా సాధికారత దిశగా కొనసాగేలా చేయాలన్న దే ఐటి పాలసీ ఉద్ధేశమని ఆయన స్పష్టం చేశారు. 10 లక్షల ఉద్యోగులు లక్ష్యంగా ప్రభుత్వం టెక్ ద్వారా సేవలను కొనసాగిస్తోం దన్నారు. అంకురాలను ఆకర్షించటంలో రాష్ట్రం చాలా ముందుందన్నారు.

ఐటీ, ఐటిఈస్‌లో వచ్చే ఐదేళ్లలో 3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా రెండో శ్రేణి నగరాలకూ ఐటి సేవలు విస్తరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దానికి కంపెనీలు కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత కోసం కృషి చేసిన వారిని మంత్రి అభినందించారు. ఆరు సంవత్సరాల తరువాత ఐటిలో అభివృద్ధి కనిపిస్తోందని నాస్కామ్ చైర్మన్ రేఖా మీనన్ తెలిపారు. ప్రొడక్ట్ సర్వీస్, స్టార్టప్ కంపెనీలు అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నాయన్నారు. ఇటీవల పబ్లిక్ సెక్టార్ హోల్డింగ్ కంపెనీ కూడా 2 డిజిట్ వృద్ధిని పొందాయన్నారు. ఇటీవల చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. భారతదేశంలో 45 లక్షల మంది ఐటి ఉద్యోగుల్లో పని చేస్తున్నారని, దీనివలన పరోక్షంగా మేలు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, అమెరికా కౌన్సిల్ జనరల్ రిఫ్‌మెన్, సియంట్ చైర్మన్ మోహన్‌రెడ్డి, రుద్రకుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News