Friday, May 10, 2024

కాంగ్రెస్ ఎంఎల్‌ఎల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

arrest

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివారు జన్వాడలోని ఫాం హౌస్ ముట్టడికి యత్నించారు. ఈ మేరకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి అసెంబ్లీ నుంచి ర్యాలీగా బయల్దేరి కోకాపేటలోని సబితానగర్ సర్కిల్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగుతూ ఫాం హౌజ్ గేటు దగ్గరికి వెళ్లబోమని, చుట్టూ ఉన్న భూములను మాత్రమే మీడియాకు చూపుతామని భట్టి అన్నారు. అంతలోనే పోలీసులు వారిని అడ్డుకొని పోలీసు వాహనంలోకి ఎక్కించి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎంఎల్‌ఎలు భట్టి, జగ్గారెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Congress Suspended MLAs Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News