Friday, April 26, 2024

లక్షా 65 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana corona cases district wise list

 

కొత్తగా 2159 పాజిటివ్‌లు, 9 మంది మృతి
జిహెచ్‌ఎంసిలో 318, జిల్లాల్లో 1841 మందికి వైరస్
1,65,003కు చేరుకున్న బాధితుల సంఖ్య
23 లక్షలకు పెరిగిన పరీక్షల సంఖ్య
వెయ్యి మార్క్ దాటిన కోవిడ్ మరణాలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య లక్షా 65 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,65,003 మందికి వైరస్ సోకినట్లు హెల్త్ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం 53,094 టెస్టులు చేయగా 2159 మందికి పాజిటివ్ తేలింది. వీరిలో 318 మంది జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా, ఆదిలాబాద్‌లో 20, భద్రాద్రి 60, జగిత్యాల 45, జనగామ 35, భూపాలపల్లి 22, గద్వాల 18, కామారెడ్డి 49, కరీంనగర్ 127, ఖమ్మం 77, ఆసిఫాబా ద్ 13,మహబూబ్‌నగర్ 24, మహబూబాబాద్ 84, మంచిర్యాల 33, మెదక్ 34, మేడ్చల్ మల్కాజ్‌గిరి 121, ములుగు 18, నాగర్‌కర్నూల్ 27, నల్గొండ 141,నారాయణపేట్ 14,

నిర్మల్ 29, నిజామాబాద్ 84, పెద్దపల్లి 47, సిరిసిల్లా 53, రంగారెడ్డి 176, సంగారెడ్డి 64, సిద్ధిపేట్ 132, సూర్యాపేట్ 66,వికారాబాద్ 22, వనపర్తి 23, వరంగల్ రూరల్ 39,వరంగల్ అర్బన్ లో 98, యాదాద్రిలో మరో 46 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,003కి చేరింది. అయితే వీరిలో 1,15,502 (70శాతం)మంది అసింప్టమాటిక్, 49,501(30శాతం) మందికి సింప్టమాటిక్‌తో వైరస్ తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1005 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

23 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 లక్షలకు పైగా కోవిడ్ టెస్టులు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు 23,29,316 పరీక్షలు చేయగా 1,65,003 మందికి పాజిటివ్‌లు తేలా యి. వీటిలో ఇప్పటికే 1,33,555 మంది పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా మారినట్లు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పది లక్షల మందిలో 53,094 మందికి టెస్టులు చేస్తున్నామని వైద్యశాఖ పేర్కొంది.

వెయ్యి మార్క్ దాటిన కరోనా మరణాలు తీరు ఇలా
రాష్ట్రంలో కరోనా మరణాలు వెయ్యి దాటాయి. తెలంగాణలో తొలి కోవిడ్ మరణం మర్కజ్ లింక్ రూపంలో మార్చి 27వ తేదిన సంభవించగా, జూన్ 3వరకు వంద మరణాలు చోటు చేసుకున్నాయి. అదే విధంగా జూన్ 20 నాటికి 200 మార్క్, జూలై 6కి 300, జూలై 16కి 400, జూలై 30కి 500, ఆగస్టు 7కి 600, ఆగస్టు 17కి 700, ఆగస్టు 28కి 800, సెప్టెంబరు 8కి 900, సెప్టెంబరు 16కి వెయ్యి మార్క్ దాటినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మొదటి వంద మరణాలు సంభవించడానికి(మొదటి మరణం సంభవించిన రోజు నుంచి) 69 రోజులు పడితే, 200కి మార్క్ దాటడానికి 86 రోజులు, 300 మార్క్‌కి 102 రోజులు, 400 మార్క్ కి 112 రోజులు, 500 మార్క్‌కి 126 రోజులు, 600 మార్క్‌కి 134 రోజులు, 700 మార్క్‌కి 144 రోజులు, 800 మార్క్‌కి 155, 900 మార్క్‌కి 166 రోజులు, 1000 మార్క్‌కి 174 రోజుల సమయం పట్టినట్లు అధికారులు చెబుతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర డెత్ రేట్ చాలా తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Telangana corona cases district wise list

Telangana corona cases district wise list
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News