Saturday, April 27, 2024

రండి.. ఇదిగో చూడండి

- Advertisement -
- Advertisement -

Talasani and Bhatti Inpects double Bedroom Houses

 

ప్రభుత్వం నిర్మిస్తున్న లక్ష ఇళ్ల నిర్మాణాలను చూపిస్తా : మంత్రి తలసాని
వాటిని పూర్తిగా చూపించేంత వరకు నేను సిద్దమే : భట్టి విక్రమార్క
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య కొనసాగుతున్న సవాళ్ళు… ప్రతి సవాళ్ళు
నేడు కూడా ఇళ్ల నిర్మాలను పరిశీలించనున్న అధికార, విపక్ష నేతలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలపై అధికార, విపక్ష పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలపై కాంగ్రెస్ నేతలు తరుచూ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై బుధవారం జరిగిన అసెంబ్లీలోనూ సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇందుకు వారికి క్షేత్రస్థాయిలోనే తగు సమాధానం చెప్పాలన్న లక్షంతో ప్రభుత్వం ఒక్కడుకు ముందుకేసింది. జిహెచ్‌ఎంసి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను చూపించడానికి తాము సిద్దంగా ఉన్నామని, అందుకు భట్టి కూడా సిద్ధమేనా? అని తలసాని సభలో సవాల్ విసిరారు. దీనిపై భట్టి కూడా వెంటనే స్పందించి ఇళ్ల నిర్మాణ పనులను చూడడానికి తాను కూడా సిద్దమేనని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తాను శాసనసభలో అన్నమాట ప్రకారం గురువారం ఉదయం 10 గంటల సమయంలో భట్టి విక్రమార్క ఇంటికి స్వయంగా వెళ్ళారు. సభలో తాను చెప్పిన విధంగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను చూపించడానికి వచ్చానన్నా… పోదామా? అని భట్టి విక్రమార్కను ఉద్దేశించి తలసాని వ్యాఖ్యానించారు. అయితే మంత్రి హోదాలో తలసాని మొదటి సారిగా తన ఇంటికి రావడంతో భట్టి రాజకీయాలను పక్కపెట్టి ఎంతో అప్యాయంగా లోనికి ఆహ్వానం పలికారు. వారిద్దరు కొద్దిసేపు కుశల ప్రశ్నలు వేసుకున్న అనంతరం జిహెచ్‌ఎంసిలో పరిధిలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కాంగ్రెస్ పక్షాన భట్టి విక్రమార్కతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, విక్రంగౌడ్ తదితరులు రాగా, ప్రభుత్వ పక్షాన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఇందులో భాగంగా నగరంలోని జియాగూడ, గోడే కి ఖబర్, కట్టెల మండి, సిసినగర్, అంబేద్కర్ నగర్‌తో పాటు కొల్లూరులో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను భట్టికి మంత్రి తలసాని చూపించారు.

అనంతరం సనత్‌నగర్ నియోజరకవర్గం పరిధిలోని జివైఆర్ కాంపౌండ్, పొట్టి శ్రీరాములునగర్, బండమైసమ్మ, మారేడుపల్లి తదతర ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను చూపించారు. ఈ సందర్భంగా సనత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడు తూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలకోసం ఉచితంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారన్నారు. అది కూడా ఉచితంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళను అన్ని సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్నామన్నారు. ఏదో మొక్కుబడిగా ఇళ్ళ నిర్మాణం చేయకుండా ప్రైవేటు అపార్టుమెంట్లకు దీటుగా… గ్రీనరీ కూడా అధిక ప్రాధాన్యతను ఇచ్చి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణలను చేపడుతోందన్నారు. సిఎం కెసిఆర్ చెప్పిన ప్రకారం వచ్చే నెలలో రానున్న దసరా పండుగ నాటికి గ్రేటర్‌లో 85వేల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

ఈ నిర్మాణాలపై సభలో విపక్ష నాయకులు దురుద్ధేశపూర్వకంగా విమర్శలు చేస్తున్న కారణంగానే భట్టిని స్వయంగా తీసుకుని ఇక్కడకు రావ డం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణాల నాణ్యతలో కూడా ఎలాంటి రాజీపడకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు. విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను పటాపంచలు చేయడానికే ఇక్కడకు రావడం జరిగిందన్నారు. భట్టి సమయం ఇస్తే మొత్తం లక్ష ఇళ్లను చూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ పర్యటనలో సుమారు 3500 ఇళ్లను పరిశీలించామన్నారు. ఇందులో కొత్తగా 400 మందికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ఇచ్చారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇళ్ల నాణ్యతను కూడా పరిశీలిస్తున్నామన్నారు. శుక్రవారం కూడా ఇళ్ల నిర్మాణలను తనిఖీ చేస్తామన్నారు. పూర్తిగా ఇళ్లను చూసిన తరువాతనే దీనిపై స్పందిస్తానని భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. అయితే శుక్రవారం భారీ వర్ష సూచన ఉన్న కారణంగా వీరి పర్యటన ఉంటుందా? అన్నది మాత్రమే వరుణ దేవుడిపైనే ఆదారపడి ఉందని తెలుస్తోంది.

Talasani and Bhatti Inpects double Bedroom Houses

Talasani and Bhatti Inpects double Bedroom Houses
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News