Monday, May 6, 2024

తెలంగాణ పత్తి నంబర్ వన్: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Telangana cotton is number one

హైదరాబాద్: పత్తి సాగుకు ప్రోత్సాహం ఉంటుందని, ఈ వానాకాలంలో 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పత్తి నాణ్యతలో జాతీయంగా, అంతర్జాతీయంగా నెంబర్ వన్ అని, కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలుమార్లు దృవీకరించిందన్నారు. విస్తీర్ణంలో మహారాష్ట్ర ఎక్కువగా ఉన్న సగటు ఉత్పత్తిలో తెలంగాణదే తొలి స్థానం అని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. పత్తి సాగు విస్తరణపై సిఎం కెసిఆర్ పట్టుదలగా ఉన్నారని, పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులకు రాయితీలతో ప్రోత్సాహిస్తామని, జిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహానికి కాటన్ సాల్వెంట్ పాలసీ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాయితీలు ఇచ్చే అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వర్తింపజేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News