Saturday, September 21, 2024

తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా?: నామా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించరని టిఆర్ఎస్ లోకసభ పక్ష నేత, ఎంపి నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వాలని, తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని దుయ్యబట్టారు. రైతులతో రాజకీయం చేస్తున్నారని, “ఆహార భద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం బాధ్యత అని మోడీ ప్రభుత్వానికి సూచించారు. భారత్ లో తెలంగాణ లేదా? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా? అని నామా ప్రశ్నించారు.  ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబందించి తొమ్మిది రోజులు పార్లమెంట్ లో ఆందోళన చేశామని, బిజెపి ఎంపిలు రైతుల గురించి కనీసం ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News