Saturday, April 27, 2024

తెలంగాణకు రూ.85,013 కోట్ల నిధులు ఇచ్చాం: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: గడిచిన ఆరేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరిల కింద ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి పన్నుల వాటా కింద మొత్తం రూ.85,013 కోట్ల నిధులు ఇచ్చామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. తెలంగాణకు మంజూరు చేసిన మొత్తం నిధుల్లో రాష్ట్రాల విపత్తుల నిధి కింద రూ.1289.4 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు విడుదల చేశామని సభలో ఆమె వెల్లడించారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక సాయం కింద వెనుకబడిన జిల్లాలకు రూ.1,916 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.3,853 కోట్లు ఇచ్చామన్నారు. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.51,298.84 కోట్లు, మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1,500.54 కోట్ల నిధులను మంజూరు చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధుల్లో కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. బిజెపి, బిజెపియేతర్ రాష్ట్ర ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిధులు విడుదల చేయదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తుందన్నారు. బాగా వెనుకబడిన రాష్ట్రాల విషయంలో కేంద్రం ఒకింత మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుందన్నారు. అంతే తప్ప బిజెపి అధికారం లేని రాష్ట్రాలను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్షం చేయదన్నారు. అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే దేశం సమగ్రభివృద్ధి చెందుతుందన్నారు. సబ్‌క్‌సాత్.. సబ్‌కా వికాస్ అనే లక్షంతో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో బిజెపి పాలన ఇందుకు నిదర్శమని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణకు నిధులను కేటాయించే విషయంలో సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర నిష్పత్తుల ప్రకారం పన్నుల రూపంలో అన్ని రాష్ట్రాలను నిధులను విడుదల చేస్తామన్నారు.

Telangana got Rs.85,013 cr from Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News