Tuesday, May 7, 2024

హరిత తెలంగాణను కెసిఆర్‌కు కానుకగా ఇద్దాం

- Advertisement -
- Advertisement -

ktr

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకుని ఈనెల 17న హరితహారంలో భాగంగా ప్రతి ఒకరు ఒక్కో మొక్క చొప్పన నాటాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. అధికారులు, జిల్లా కలెక్టర్లకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు కెసిఆర్ జన్మదిన సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈనెల 17న కెసిఆర్ 66వ ఏట అడుగుపెట్టబోతున్నారని కెటిఆర్ ట్విట్ చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా గ్రీన్ కవర్‌ను పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి మొక్కల పెంపకం పట్ల ఇష్టాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఆయన పుట్టిన రోజు కూడా లక్ష మొక్కలు నాటాలని అభిమానులు కోరారు. యువ నేత కెటిఆర్ పిలుపుతో గ్రేటర్ టిఆర్‌ఎస్ నాయకులు ఆయా డివిజన్లలో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి స్థానిక కార్యకర్తలతో సమావేశం జరిపి ఈసారి తమ డివిజన్ పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి కెసిఆర్ హరిత తెలంగాణ కల సాకారమయ్యేలా నడుం బిగించాలని శ్రేణులను సూచించారు.150 డివిజన్ల పరిధిల్లో 25వేల మొక్కలు నాటేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నగరానికి చెందిన సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు.

To Celebrate CM KCR’s Birthday with plant saplings: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News