Monday, May 6, 2024

కాలుష్యం కట్టడికి చర్యలు!

- Advertisement -
- Advertisement -

pollution

 డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రానిక్ వాహనాలు
పన్ను మినహాయింపునకు ప్రభుత్వం నిర్ణయం !
విధి విధానాలను సిద్ధం చేస్తున్న అధికారులు
పారిశ్రామిక వాడల్లో చెట్ల పెంపునకు ప్రోత్సాహం

హైదరాబాద్ : ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయినట్టుగా సమాచారం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక తయారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రవాణాశాఖ, పిసిబిలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కెసిఆర్ సూచించినట్టుగా సమాచారం. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో వాహనాలతో పాటు కాలుష్యం గురించి సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టుగా తెలిసింది. వాహనాల పొగతో నగరం వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి కాకముందే మొక్కలు పెంచడంతో పాటుగా డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టాలని ఆ దిశగా ముందుకెళ్లాలని రవాణాశాఖతో పాటు పిసిబి యంత్రాంగానికి సిఎం సూచించినట్టుగా తెలిసింది.

రోడ్లపై ప్రస్తుతం 15 లక్షల వాహనాలు

హైదరాబాద్‌లో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఆ వాహనాల సంఖ్యను పెరగకుండా ఉంచేందుకు వాటి విక్రయాలు తగ్గేలా చర్యలు చేపట్టాలని సిఎం సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులకు కెసిఆర్ దిశా నిర్ధేశం చేసినట్టుగా తెలిసింది.

డీజిల్ వాహనాలపై మరింత అధిక పన్నును వసూలు చేయాలని !

ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ వాహనాలపై మరింత అధిక పన్నును వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అదే సమయంలో 12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించడానికి వీలుగా ఉన్న అంశాలపై విశ్లేషణ జరపాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేలా విధి, విధానాలను సిద్ధం చేయాలని కెసిఆర్ నిర్ణయించారని ఆ దిశగా అధికారులను ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది . ఈ క్రమంలోనే బ్యాటరీ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని బట్టి చూస్తే మహానగరంలో డీజిల్ వాహనాలు తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.

కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్భన ఉద్గారాల కారణంగా ఇప్పటికే కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై కఠినంగా వ్యవహారించాలని ప్రభుత్వం పిసిబి అధికారులకు సూచించింది. కనీస జాగ్రత్తలు పాటించని పరిశ్రమలపై నిరంతర నిఘా ఉంచడమే కాకుండా వాటిపై చర్యలు అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. కాలుష్యం వలన వాతావరణ సమతుల్యత దెబ్బతింటుండడంతో దానిని కాపాడుకోవడానికి ఇప్పటికే పలు వినూత్న కార్యక్రమాలను పిసిబి సంస్థ చేపట్టింది.

అందులో భాగంగానే అన్ని పారిశ్రామిక వాడలతో పాటు పరిశ్రమల్లో చెట్లను పెంచాలని సిఎం పిలుపునిచ్చినట్టుగా తెలిసింది. దీంతోపాటు కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్భన ఉద్గారాల కారణంగా స్వచ్ఛమైన గాలి కలుషితమవుతుందని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం తీరిన వాహనాలకు చెల్లు చీటి పాడాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కాలంచెల్లిన వాహనాలకు చెక్ పెట్టడంతో పాటు నిరంతరం కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలని, వాటి పట్ల కఠినంగా వ్యవహారించాలని రవాణాశాఖ అధికారులకు సిఎం సూచించినట్టుగా తెలుస్తోంది.

Telangana government takes steps to curb air pollution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News