Thursday, May 2, 2024

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Telangana ICET Notification Released 2021

హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. కంట్రోలర్ మహేందర్ రెడ్డి ఐసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్ 15వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. రూ. 250 అపరాధ రుసుంతో జూన్ 30వరకు, రూ.500 అపరాధ రుసుంతో జులై 15 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో ఆగస్టు 11 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 13 నుంచి ఐసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 19,20 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు కంట్రోలర్ తెలిపారు. సెప్టెండర్ 17న ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో 14 రీజినల్ సెంటర్లలో ఐసెట్ పరీక్ష జరపనున్నారు. ఐసెట్ నిర్వహణ కోసం 60 కేంద్రాల గుర్తించినట్టు కంట్రోలర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

Telangana ICET Notification Released 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News