Saturday, April 27, 2024

వృద్ధి శిఖరాన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Telangana is leading country in per capita income

 

 

రాష్ట్రంగా విడిపోయిన తర్వాతనే కళ్లు మిరుమిట్లు గొలిపే సిరిసంపదలు

తలసరి ఆదాయంలో దేశానికే తలమానికం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం బీహార్ కంటే తక్కువగా ఉండేది. రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లా కరీంనగర్ తలసరి ఆదాయం ఇప్పుడు దేశ తలసరి ఆదాయం రూ.1.20 లక్షల కంటే 25 శాతం ఎక్కువగా ఉన్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాతనే రాష్ట్ర వృద్ధి వేగవంతమైంది. మొత్తంగా తెలంగాణలో తలసరి ఆదాయం కూడా వేగంగా పెరుగుతున్నది. గతేడాది రూ.2,04,488గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఈ ఏడాది 11.6 శాతం వృద్ధితో రూ. 2,28,216కు పెరిగింది. జిల్లాల వారీగా (డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటా ఇన్‌కమ్)లో రూ.5,78,979 తలసరి ఆదాయంతో రంగారెడ్డి అగ్రస్థానంలో, రూ.3,57,287తో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ. 1,35,050కి, వృద్ధిరేటు 6.4 శాతానికి పరిమితమయ్యాయి.

                                                                                        – ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి

మన తెలంగాణ/హైదరాబాద్ : తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వం సా గు నీటిపారుదల రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం, హైదరాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఇది సాధ్యమైందన్నారు. గతంలో తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం బీహర్ కంటే తక్కువ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో వెనకబ డ్డ జిల్లా కరీంనగర్ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం రూ.1.20 లక్షల కంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషమన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాతనే రాష్ట్ర వృద్ధి వేగవంతమైందని స్పష్టం చేశారు. ఇదంతా కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ వల్లనే సాధ్యమైందని రాష్ట్ర ప్రజలు అంగీకరించడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదన్నారు.

ఆర్థిక వేత్త పేర్కొన్నట్లు తెలంగాణ సంపద ఈ ఏడాది కూడా గణనీయంగా పెరిగిం ది. దేశంలో అగ్రభాగాన నిలుస్తున్న తెలంగాణలో తలసరి ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. గతేడాది రూ.2,04,488గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఈ ఏడాది 11.6 శాతం వృద్ధిరేటుతో రూ. 2,28,216కు పెరిగింది. జిల్లాల స్థాయిలో తలసరి ఆదాయం (డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటా ఇన్‌కమ్)లో రూ.5,78,979తో రంగారెడ్డి అగ్రస్థానంలో, రూ.3,57,287తో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ. 1,35,050కి, వృద్ధిరేటు 6.4 శాతానికి పరిమితమైంది. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక 2020 స్పష్టం చేసింది. ప్రస్తుత ధరల వద్ద మొత్తం సంపద వృద్ధిరేటులో తెలంగాణ మిగిలిన పెద్ద రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది.

తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా నిలిచాయి. ప్రత్యేక రాష్ర్టంగా ఆవిర్భావించిన ఐదు సంవత్సరాలలోనే మొత్తం సంపద రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 9,69,604 కోట్లకు పెరిగింది. 201819 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం సంపద ప్రస్తుత ధరల వద్ద రూ. 8,61,031 కోట్లుగా ఉంది. గతేడాది తెలంగాణలో 14.3 శాతంగా నమోదైన జిఎస్‌డిపి వృద్ధి రేటు, ప్రస్తుత, 201920 ఆర్థిక సంవత్సరంలో 12.6 శాతానికి తగ్గినప్పటికీ రాష్ర్ట సంపద మరో రూ. 1,08,573 కోట్ల మేరకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధిరేటు 11 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గడం విశేషం. స్థిర ధరల ప్రకారంగా చూస్తే మన రాష్ర్ట సంపద రూ. 6,12,828 కోట్ల నుంచి రూ. 6,63,258 కోట్లకు పెరిగింది.

 

Telangana is leading country in per capita income
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News