Wednesday, May 1, 2024

రికవరీలో రాష్ట్రం హిస్టరీ

- Advertisement -
- Advertisement -

Telangana is second in Corona recovery rate

 

పంజాబ్ తర్వాత రెండో స్థానం
చికిత్సపట్ల కోలుకుంటున్నవారి సంతృప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా రికవరీ రేట్‌లో(కోలుకుంటున్న వారు) రాష్ట్రం ముందంజలో నడుస్తుంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న గణాంకాల ప్రకారం కరోనా రికవరీ రేట్‌లో తెలంగాణ రెండవస్థానం(శనివారం వరకు కేంద్ర ప్రభుత్వ లెక్కలు ప్రకారం)లో నిలిచింది. వెయ్యికంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలను పరిశీలించగా, పంజాబ్ 64.59 శాతంతో తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 64.34 శాతంతో రెండోస్థానంలో ఉంది.

ఈ తర్వాత 57.45 శాతంతో మూడోస్థానంలో ఏపి, 57.32 శాతంతో ఉత్తర్ ప్రదేశ్ నాల్గొస్థానం, 57.23 శాతంతో రాజస్థాన్ ఐదోస్థానంలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 14 రాష్ట్రాల్లో వెయ్యికంటే ఎక్కువ కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారని నిపుణులు అభిప్రాయం. శనివారం వరకు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వెయ్యికంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, బీహర్, ఢిల్లీ, గుజరాత్, జమ్ము, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్‌బెంగాల్‌లు ఉన్నాయి.

పంజాబ్ 64.59….తెలంగాణ 64.34 శాతం……

దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేట్‌లో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పటి వరకు పంజాబ్ రాష్ట్రంలో 1946 కరోనా పాజిటివ్‌లు నమోదు కాగా, 1257 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ దాడిలో మొత్తం 32 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 64.59 శాతంతో మొదటిస్థానంలో కొనసాగుతుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1509 మంది కరోనా బాధితులు ఉండగా, వీరిలో 971 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు. వైరస్ బారిన పడి మొత్తం 34 మంది మృతిచెందారు.

దీంతో ఈ రాష్ట్రంలో రికవరీ రేట్ 64.34 తో రెండోస్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ రికవరీ రేట్ బాగానే ఉంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 2355 మంది కరోనా బాధితులు నమోదు కాగా, 1353 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ దాడిలో మొత్తం 49 మంది మరణించారు. దీంతో ఆ రా్రష్ట్రం 57.45 శాతంతో కరోనా రికవరీ రేట్ తో మూడోస్థానంలో ఉంది. అదే విధంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4258కి వైరస్ సోకగా, 2441 మంది కోలుకున్నారు. దీంతో ఈ రాష్ట్రం 57.32శాతంలో నాలుగోస్థానంలో నిలువగా, రాజస్థాన్ 57.23శాతంతో ఐదోస్థానంలో ఉంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేట్ 37.51శాతం కొనసాగుతోంది.

తెలంగాణలో అద్బుతమైన చికిత్స అందుతుంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోగులకు అద్బుతమైన చికిత్స అందిస్తున్నారని పేషెంట్ నెం 16 ఎన్నంశేట్టి అఖిల్ స్పష్టం(డిశ్చార్జ్ అయిన వ్యక్తి)చేశారు. తనకు వైరస్ సోకిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో చేరానని, మొదట్లో భయందోళనకు గురైనప్పటికీ, అక్కడ అందించిన వైద్యానికి ఫిధా అయ్యానని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఇంత అద్బుతంగా వైద్యం అందించడం తొలిసారి చూశానని అన్నారు. కరోనా సోకగానే భయాందోళనకు గురికావొద్దని, రోగనిరోధశక్తిని పెంచుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. గాంధీ వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News