Monday, April 29, 2024

ట్రిపుల్ డ్రగ్

- Advertisement -
- Advertisement -

Hong Kong Doctors Triple Drug on Corona

 

కరోనాపై హాంకాంగ్ వైద్యుల అస్త్రం

హాంగ్‌కాంగ్: కరోనా వైరస్ చికిత్సకు మందు ఆవిష్కరణలో ఓ ఆశారేఖ తళుక్కుమంది. వైరస్ నుంచి రోగులు త్వరితగతిన కోలకునే ట్రిపుల్ డ్రగ్ తయారైంది. ఈ విషయంలో తాము విజయం సాధించినట్లు హాంగ్‌కాంగ్ వైద్యుల బృ ందం తెలిపింది. మూడు మందుల స మ్మేళనం, దీనికి అనుబంధంగా రోగనిరోధక శక్తిని పెంచే ఉత్ప్రేరకాన్ని తాము కోవిడ్ చికిత్స విధానంగా ప్రయోగించినట్లు ఈ డాక్టర్లు తెలిపారు. శక్తివంతమైన వైరస్‌ను ఒకే ఒక్క యాంటివైరల్ డ్రగ్‌తో తట్టుకోవడం అసాధ్యం అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని హాంగ్‌కాంగ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ల బృందం పరిశోధనలు జరిపింది. అతి తక్కువ వ్యవధిలోనే తాము ఈ విషయంలో విజయం సాధించినట్లు, కొంద రు కరోనా రోగులపై దీనిని పరీక్షించినట్లు బృందానికి చెందిన డాక్టర్ క్వోక్ యంగ్ యుయెన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చికిత్స కోసం పలు ప్రయోగాలు సాగుతున్నాయి. రోగులు తొందరగా వైరస్ నుంచి కోలుకునే రీతిలో ఈ ట్రిపుల్ డ్రగ్గ్ పనిచేస్తుందని వివరించారు. ఇప్పటివరకైతే ప్రపంచవ్యాప్తంగా చూస్తే గిలీడ్ ఫార్మాస్యూటికల్ రూపొందించిన రెమ్‌డెసివిర్ డ్రగ్గ్ ఒక్కటే.

తొలి అధికారిక వైరస్ చికిత్సా విధాన ప్రక్రియగా మారింది. ఇది వసరానికి తగ్గట్లుగా సరఫరా లేదని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే హాంగ్‌కాంగ్ వైద్యులు పరిశోధనలు జరిపారు. ఎన్ని మందులను వైరస్ చికిత్స కోసం వాడినా మనిషిలో సరిపడా రోగ నిరోధక శక్తి ఉండటం అవసరం. అప్పుడే ఉత్పత్తి చేసే మందు సమగ్ర చికిత్సా విధానానికి దోహదం చేస్తుందని డాక్టర్లు తెలిపారు. హాంగ్‌కాంగ్ డాక్టర్లు ట్రిపుల్ డ్రగ్ తయారీకి హెచ్‌ఐవి డ్రగ్ రిటోనవిర్‌ను, లోపనివిర్‌ను రోగనిరోధక శక్తి కోసం వాడే బెటా ఇంటర్‌పెరాన్‌ను వినియోగించారు. ఈ మూడు యాంటి వైరల్ ఔషధాలతో తాము సమగ్రమైన ట్రిపుల్ డ్రగ్‌ను రూపొందించినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రయోగాత్మక దశలో ఇది సత్వర ఫలితాలను చూపిందని, అయితే మరికొన్ని పరిశోధనల తరువాత దీని సామర్థం మరింతగా బలపడుతుందని వివరించారు. ఓ మోస్తరు నుంచి మధ్యస్థ స్థాయిలో వైరస్ సోకిన వారికి ఈ ట్రిపుల్ డ్రగ్‌ను వాడి చూశారు.

వైరస్ పాజిటివ్ వచ్చిన ఏడు రోజుల వ్యవధిలోనే ఈ డ్రగ్‌తో చికిత్స జరిపితే ఎక్కువగా ఫలితం ఉంటుందని డాక్టర్లు నిర్థారించారు. వైరస్ సోకిన తొలినాళ్లలోనే దీనితో చికిత్స జరిగితే త్వరితగతిన ఫలితం దక్కుతుందని గుర్తించారు.ఏడు రోజుల వ్యవధిలోనే వీరికి నయం అయినట్లు ప్రస్తుతానికి నిర్థారణ అయింది. ఇక కేవలం హెచ్‌ఐవి డ్రగ్స్ తీసుకున్న వారికిసగటున చూస్తే 12 రోజులలో కరోనా విముక్తి పొందినట్లు లాన్సెట్ వైద్య సంచిక తెలిపింది. అయితే ఇతర వైద్య చికిత్సా విధానాలతో పోలిస్తే ఈ ప్రక్రియలో తక్కువ స్థాయిలో ఇతరత్రా ప్రభావాలు కన్పించినట్లు ధృవీకరించారు. వైరస్ చికిత్సకు రూపొందించిన ఈ ఔషధం అన్ని విధాలుగా భద్రతాయుతం అని కాలిఫోర్నియాకు చెందిన కరోనా డాక్టర్ల బృందం కూడా పేర్కొంది. అమెరికాలో రూపొందిన రెమ్‌డెసివిర్ ఒక్కటే చికిత్సకు మందు కాదని, ఇతరత్రా ఆవిష్కరణలు కూడా రావాలని ఆకాంక్షించారు. వైరస్‌పై వైద్యపరమైన పోరు దిశలో ఈ డ్రగ్ బాగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు డాక్టర్ పీటర్ చిన్ హాంగ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News