Tuesday, April 30, 2024

వరంగల్ జిల్లాలో అకాల వర్షం

- Advertisement -
- Advertisement -

Premature rain in Warangal district

 

పిడుగుపాటుకు ఇద్దరు మృతి
తడిసిన వరి ధాన్యం

మన తెలంగాణ/నర్సంపేట/చెన్నారావుపేట: ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అపార నష్టం జరిగింది. వర్షం కారణంగా రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసిముద్దయింది. అదే విధంగా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామంలో పి డుగు పాటుతో ఇద్దరు చనిపోయారు. రేకుల షెడ్లు, రైస్‌మిల్లులు, షెడ్లూ కూలిపోయాయి. డివిజన్ వ్యాప్తంగా ఆరు మండలాల్లో గాలి దుమారం బీభత్స ం రైతుల్ని అతలాకుతలం చేసింది. పిడుగుపాటు సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ… అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం కలగడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విపరీతంగా తడిసిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకర్, సివిల్ సప్లై ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్‌కుమార్‌లతో తాను మాట్లాడానని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసువాలని తాను వారిని కోరినట్టు ఎమ్మెల్వే పెద్ది తెలిపారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్య లు తీసుకుంటామని ఆయన తెలిపారు. అకాల వర్ష ం పడుతుండడం వల్ల రైతులు తమ ధాన్యం తడిసి పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెన్నారావుపేట మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయారు. గ్రామానికి చెందిన ముటిక కుమారస్వామి(55), మేగ్యతండాకు చెందిన ఆజ్మీర రామస్వామి(65)లు పొలం వద్ద పనులు చేస్తున్న సమయంలో భారీ వర్షం కారణంగా పిడుగు పడి చనిపోయారు. వీరి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతు ల కుటుంబాలను ఎమ్మెల్వే పెద్దితో పాటు సర్పంచి తప్పెట రమేష్, ఎంపిటిసి రమేష్, ఉపసర్పంచ్ రాజ్‌కుమార్ తదితరులు పరామర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News